Saturday 23rd May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బీజేపీ చీఫ్ పై నటి త్రిష ఆగ్రహం

బీజేపీ చీఫ్ పై నటి త్రిష ఆగ్రహం

Tamil Nadu BJP Chief’s Remarks On Vijay Spark Row | తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్ర పై హీరోయిన్ త్రిష తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత అగౌరవంగా మాట్లాడతారని ఊహించలేదని త్రిష తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కాగా త్వరలో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి వెళ్ళింది. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్ ను విమర్శించే క్రమంలో బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. విజయ్ కి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదని విమర్శించిన ఆయన, తమిళనాడు పరిస్థితి అర్ధం అవ్వాలంటే విజయ్ ఇంట్లో నుండి బయటకు రావాలని, మరీ ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

ఈ తరుణంలో త్రిష తరఫు ఆమె న్యాయవాది ఓ ప్రకటన విడుదల చేశారు. త్రిషకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, సంబంధం లేని విషయాల్లోకి త్రిషను లాగొద్దని న్యాయవాది పేర్కొన్నారు. అలాగే రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు ఊహించలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ వివరణ ఇచ్చారు. ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశ్యం తనకు లేదన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions