Sunday 23rd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > AI సమ్మిట్ కు బిల్ గేట్స్..సిగ్గుచేటన్న ఎంపీ!

AI సమ్మిట్ కు బిల్ గేట్స్..సిగ్గుచేటన్న ఎంపీ!

Bill gates in epstein files | న్యూ ఢిల్లీలో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ కు మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు ఆహ్వానం వెళ్లడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు రావడం, అందులో బిల్ గేట్స్ పేరుతో ఉన్న పలు మెయిల్స్ కలకలం రేపాయి. యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ కు రష్యా యువతులతో శ్రుంగారంలో పాల్గొనడంతో ఎస్టీడీ శ్రుంగార వ్యాధి సోకినట్లు పేర్కొనడం తీవ్ర వివాదంగా మారింది.

ఇదే సమయంలో భారత్ లో జరగనున్న ఏఐ సమ్మిట్ కు బిల్ గేట్స్ హాజరవుతుండడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందించారు. ఎప్‌స్టీన్ ద్వీపంలో ఆకృత్యాలకు పాల్పడిన వ్యక్తిని ఎలా ఆహ్వానిస్తారని కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కూడా కలుస్తున్నారా? అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. ఇదే జరిగితే అంతకన్నా సిగ్గుచేటు ఉండదన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions