Sunday 23rd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రాణం పోయినా ఐదుగురి జీవం పోసిన 10 నెలల చిన్నారి

ప్రాణం పోయినా ఐదుగురి జీవం పోసిన 10 నెలల చిన్నారి

10-Month-Old Infant Declared Brain Dead Becomes Kerala’s Youngest Organ Donor | కేరళ రాష్ట్రంలో 10 నెలల చిన్నారి తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తమ కుమార్తె మరణించి నేపథ్యంలో చిన్నారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలా మరో నలుగురికి ప్రాణం పోశారు. పతనంతిట్ట జిల్లాలోని మల్లప్పల్లికి చెందిన ఆలిన్ షెరిన్ అబ్రహం అనే 10 నెలల వయసున్న చిన్నారి ఫిబ్రవరి 5న రోడ్డు ప్రమాద బారిన పడింది. తల్లి, తాతయ్యతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న బ్రెయిన్ డెడ్ అయి చిన్నారి కన్నుమూసింది. ఈ విషాద సమయంలోనూ చిన్నారి తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ అన్ జాన్ గొప్ప ఔదార్యం చాటారు. కుమార్తె అవయవాలను దానం చేయడానికి సమ్మతి తెలిపారు.

ఈ క్రమంలో అవయవ దాన ప్రక్రియను కేరళ రాష్ట్ర అవయవ మార్పిడి సంస్థ సమన్వయం చేసింది. ఇలా వేర్వేరు ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న నలుగురు చిన్నారులకు అవయవాలను అమర్చారు. కిడ్నీలు, గుండె కవాటాలు, కార్నియాలు, లివర్ ను అమర్చారు. అవయవాలను తరలించేందుకు అధికారులు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు. కేరళ రాష్ట్రంలో అవయవ దానం చేసిన అత్యంత పిన్న వయస్కురాలు ఈ పది నెలల చిన్నారి అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో అలిన్ షెరిన్ అబ్రహం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions