KBK Group’s Walk – In Interview Drive | గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారికి గొప్ప అవకాశం. డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్ మెంట్, మార్కెటింగ్, డిజిటల్ వీడియో క్రియేషన్స్ విభాగాల్లో హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందిస్తున్న కేబీకే గ్రూప్, డిజిటల్ కనెక్ట్ ఆధ్వర్యంలో మెగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ డ్రైవ్ జరగనుంది.
హైదరాబాద్ ఉప్పల్ లోని కేబీకే గ్రూప్ ప్రధాన కార్యాలయం, జూబ్లిహిల్స్ లోని డిజిటల్ కనెక్ట్ ఆఫీసుల్లో ఫిబ్రవరి 8 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మెగా డ్రైవ్ జరగనుంది.
ఈ డ్రైవ్ ద్వారా IT, డిజిటల్ మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ & సపోర్ట్, వీడియో ప్రొడక్షన్ మరియు సలోన్ ప్రొఫెషనల్స్ పొజిషన్స్ కోసం నియమాకాలు చేపట్టనున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎక్స్ పీరియెన్స్డ్ కాండిడేట్స్ తో పాటు, ఫ్రెషర్స్ కు కూడా అవకాశం కల్పిస్తున్నారు. రిజిస్ట్రేషన్, పూర్తి వివరాల కోసం ఫోన్ నంబర్ 73311 12699, 81215 96699 లలో సంప్రదించవచ్చు.











