Saturday 2nd May 2026
12:07:03 PM
Home > తాజా > ‘జాగృతి ప్రభుత్వం వస్తుంది..మా పార్టీలో చేరండి అన్న’

‘జాగృతి ప్రభుత్వం వస్తుంది..మా పార్టీలో చేరండి అన్న’

Kalvakuntla Kavitha News | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోకి వస్తా అంటే మహేష్ కుమార్ వద్దు అన్నట్లు మీడియాలో కథనాలు వచ్చిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. వచ్చేది జాగృతి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేసిన ఆమె టీపీసీసీ చీఫ్ ను తన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు.

జాగృతి పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పిన కవిత మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో చేరితే ఆయన రాజకీయ అనుభవానికి తగ్గట్లు మంచి పదవి ఇస్తామని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోకి వస్తా అనడం, ఆయన వద్దు అనడంలో వాస్తవం లేదన్నారు. బహుశా మహేష్ కుమార్ గౌడ్ కు కలలో ఇలా కనిపించి ఉండవచ్చని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో తన వ్యక్తిత్వాన్ని కించపరచొద్దన్నారు. జాగృతి పార్టీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions