Friday 31st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రభుత్వ అతిథిగా పవన్ కు మహా సర్కార్ స్వాగతం

ప్రభుత్వ అతిథిగా పవన్ కు మహా సర్కార్ స్వాగతం

Pawan Kalyan In Maharashtra | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాందేడ్ కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ అతిథి హోదాలో మహారాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలికింది. ప్రముఖ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు నాందేడ్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ను ప్రభుత్వ అతిథిగా మహారాష్ట్ర సర్కార్ స్వాగతం పలికింది.

నాందేడ్ లోని గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు అశోక్ చవాన్, ఆయన కుమార్తె, భోకార్ శాసన సభ్యురాలు జయ చవాన్, నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికారు. బస దగ్గర నాందేడ్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి అజిత్ సావే, రాజ్యసభ సభ్యులు అజిత్ గోప్ చడే, ఆర్.ఎస్.ఎస్. ప్రముఖులు రాజేంద్ర కోడగే తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను స్వాగతించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions