Monday 31st August 2026
12:07:03 PM
Home > తాజా > ‘నా అయ్యా కేసీఆర్..మొగోడు, మొనగాడు’

‘నా అయ్యా కేసీఆర్..మొగోడు, మొనగాడు’

KTR News Latest | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకుని బ్రతికే వ్యక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెల్సిందే. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలపై తాజగా కేటీఆర్ స్పందించారు. తన తండ్రి కేసీఆర్ మొనగాడు, తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తి అని ఆయన పేరును చెప్పుకోవడంలో తప్పేం ఉందని అడిగారు.

కచ్చితంగా కేసీఆర్ పేరు చెప్పే రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. తన తండ్రి పేరును తాను చెప్పుకోవడంలో తప్పేముందన్నారు. మంచి పనులు చేస్తే రేవంత్ రెడ్డి పేరును కూడా ఆయన మనవడు చెప్పుకుంటాడాని పేర్కొన్నారు. బీఆరెస్ అధినేత, తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు, రెండు సార్లు ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి అనే అంశాలు పక్కన పెడితే తన తండ్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు తన తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమ కాలు చెప్పు తీసి కొట్టాలనేంత కోపం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే తాను గుంటూరు లో ఇంటర్ చదువుకున్నానని విమర్శించే రేవంత్ రెడ్డి, భీమవరం కు చెందిన వ్యక్తిని అల్లుడిగా చేసుకున్నారని పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions