Tuesday 15th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > అతి కొద్ది రోజుల్లో భారత్-పాక్ సమరం

అతి కొద్ది రోజుల్లో భారత్-పాక్ సమరం

T20 World Cup 2026 schedule | శ్రీలంక కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న భారత్-పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. టీ-20 వరల్డ్ కప్ 2026 కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ తాజగా ప్రకటించింది. భారత్, శ్రీలంక లోని ఏడు నగరాల్లోని ఎనమిది స్టేడియంలో ఈ టోర్నీ సాగనుంది. మొత్తం 20 జట్లు ఇందులో పాల్గొననున్నాయి. ఇటలీ దేశం తొలిసారి టీ-20 వరల్డ్ కప్ అర్హత సాధించింది. ఇకపోతే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.

ఇందులో రెండు జట్లు సూపర్-8 కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించే మ్యాచులు జరుగుతాయి. ఇకపోతే భారత్, పాకిస్థాన్ గ్రూప్-ఏ లో ఉన్నాయి. వీటితో పాటు యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ఇకపోతే కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థుల పోరు జరగనుంది. ఆసియా కప్-2025లో ముచ్చటగా మూడు సార్లు భారత్, దాయాధి పాక్ ను చిత్తు చేసిన విషయం తెల్సిందే. భారత్ లోని ఐదు నగరాల్లో, శ్రీలంక లోని రెండు నగరాల్లో గల మూడు స్టేడియంలో మ్యాచులు జరుగుతాయి. ఫిబ్రవరి ఏడున టీం ఇండియా తొలి మ్యాచ్ ముంబయి వేదికగా అమెరికాతో ఆడనుంది. ఫైనల్స్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతాయి. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్ చేరితే మాత్రం మ్యాచ్ కొలంబో వేదికగా జరగనుంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions