Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రైసిన్ విషంతో ఉగ్రదాడి..భగ్నం చేసిన గుజరాత్ ఏటీఎస్

రైసిన్ విషంతో ఉగ్రదాడి..భగ్నం చేసిన గుజరాత్ ఏటీఎస్

Doctor arrested in Gujarat was preparing ricin poison | దేశంలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్. అత్యంత ప్రమాదకరమైన రైసిన్ విషం ఉపయోగించి దాడులు చేయాలని భావించిన ముగ్గురు ఉగ్రవాదులను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది.

సంవత్సరం నుండి వీరి కార్యకలాపాలపై నిఘా పెట్టి మరీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత భారత్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ప్రావిన్స్ లో సంబంధాలు పెట్టుకుని భారత్ లో ఉగ్రదాడులు చేసేందుకు కుట్ర పన్నాడు. అయితే నవంబర్ 7న ఆయుధాల మార్పిడి కోసం అతడు గుజరాత్ కు వచ్చిన క్రమంలో ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది.

ఆ తర్వాత అతడితో కలిసి పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన అజద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహైల్ ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు టెలిగ్రామ్ ద్వారా ఉగ్ర సంస్థతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని, ఐఎస్కేపీ ఆదేశాల మేరకు డాక్టర్ అయిన అహ్మద్ సయ్యద్ రైసిన్ విషయాన్ని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అంతేకాకుండా ఉగ్ర దాడి జరిపేందుకు లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ లోని అధికంగా ప్రజలు సంచరించే ప్రదేశాలలో సైతం రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. వీరికి పాకిస్థాన్ బార్డర్ నుంచి డ్రోన్ సహాయంతో ఆయుధాలు కూడా అందాయి. ఉగ్రవాదులు దాడి కోసం ఎంచుకున్న రైసిన్ అనే విషం అత్యంత ప్రమాదకరం. ఇది సైనైడ్ కంటే వేల రేట్లు ప్రమాదం.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions