Tuesday 10th March 2026
12:07:03 PM
Home > తాజా > మహేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. SSMB29పై కీలక అప్డేట్!

మహేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. SSMB29పై కీలక అప్డేట్!

ssmb 29 update

SSMB29 Update | సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamauli) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. Ssmb29 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లిమ్ప్స్‌ ను నవంబర్ 15న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఈవెంట్‌లోనే సినిమా అధికారిక టైటిల్‌ను ప్రకటించి, ఓ పవర్‌ఫుల్ గ్లిమ్ప్స్‌ ను విడుదల చేసేందుకు సినిమా యూనిట్  సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

You may also like
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి
chiranjeevi
నా విజయ రహస్యం నువ్వే అని చెబుతా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
vijay and rashmika in vd14
విజయ్ రష్మిక పెళ్లి డేట్ ఇదే.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
varanasi
కాశీలో హెర్డింగ్ లపై వీడిన సస్పెన్స్.. వారణాసి సినిమా రిలీజ్ డేట్ ఇదే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions