CM Good News To Auto Drivers | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల స్త్రీ శక్తి పథకం (Sthri Shakthi) పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే.
దీంతో ఆటో డ్రైవర్లు ఈ పథకంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధికి నష్టం వాటిల్లుందని వాపోయారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుకు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు.
బుధవారం అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ (Super Six Super hit)వేదికగా కీలక ప్రకటన చేశారు. దసరా నుంచి వాహన మిత్ర పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 15 వేల ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు.










