Thursday 17th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > శ్రీశాంత్ ను కొట్టిన భజ్జీ…వీడియో రిలీజ్ చేసిన లలిత్ మోదీ

శ్రీశాంత్ ను కొట్టిన భజ్జీ…వీడియో రిలీజ్ చేసిన లలిత్ మోదీ

Lalit Modi releases SreesanthHarbhajan Singh’s rare video from slapgate incident | ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ లో జరిగిన ఓ సంఘటన అప్పట్లో కలకలం రేపింది.

2008 ఐపీఎల్ తొలి సీజన్ సందర్భంగా ముంబయి ఇండియన్స్-పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబయి బౌలర్ హర్భజన్ సింగ్, పంజాబ్ పేసర్ శ్రీశాంత్ ను చెంప దెబ్బ కొట్టాడు. ఆ సమయంలో ఈ ఘటన సంచలనంగా మారింది. అలాగే వివాదానికి దారి తీసింది.

తాజగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ విడుదల చేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ తో ఇంటర్వ్యూ సందర్భంగా లలిత్ మోదీ వీడియోను విడుదల చేశారు.

‘ మ్యాచ్ ముగిసింది. కెమెరాలు సైతం ఆఫ్ అయ్యాయి. అయితే నా సెక్యూరిటీ కెమెరా మాత్రం ఆన్ లో ఉంది. ఇందులోనే చెంపదెబ్బ వీడియో రికార్డు అయ్యింది. ప్లేయర్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో శ్రీశాంత్ చెంపపై భజ్జీ చాలా కోపంగా కొట్టాడు. ఈ ఘటన తర్వాత భజ్జీపై ఎనిమిది మ్యాచుల నిషేధం విధించాం’ అని లలిత్ మోదీ పేర్కొన్నారు. కాగా శ్రీశాంత్ ను కొట్టడంపై హర్భజన్ చాలా సార్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెల్సిందే.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions