Friday 31st July 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఇది టెస్టు క్రికెట్ వైభవం..టీం ఇండియా విజయంపై సత్య నాదెళ్ల

ఇది టెస్టు క్రికెట్ వైభవం..టీం ఇండియా విజయంపై సత్య నాదెళ్ల

Microsoft CEO Satya Nadella hails India vs England Oval Test thriller | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ 2-2 తో డ్రాగా ముగిసింది.

చివరి టెస్టు చివరి రోజు ఆటలో భారత ఆటగాళ్లు ప్రత్యేకంగా మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో కేవలం ఆరు పరుగుల తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ సమం అవ్వడంతో ఇరు జట్ల కెప్టెన్లు బెన్ స్టోక్స్, శుభమన్ గిల్ సంయుక్తంగా ట్రోఫీని అందుకున్నారు.

ఈ క్రమంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ’25 రోజులు. 5 సమరాలు. 2-2తో సమం. ఇది కేవలం ఆట కాదు. ఇది టెస్ట్ క్రికెట్, దాని శాశ్వతమైన వైభవానికి ప్రతీక. ఒక అద్భుతమైన సిరీస్. డ్రామా, ధైర్యం, మరియు గొప్పతనం ప్రదర్శించిన భారత్-ఇంగ్లాండ్ జట్లకు హాట్స్ ఆఫ్’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

కాగా ఈ టెస్టు సిరీస్ జరిగిన తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. టెస్టు ఫార్మాట్ కు ఆదరణ తగ్గుతున్న సమయంలో ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచులు తిరిగి ఈ ఫార్మాట్ ను అగ్ర స్థానంలో నిలిపేందుకు దోహద పడుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions