Wednesday 18th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఇందిరా గాంధీలా ధైర్యం ఉంటే..ట్రంప్ మాటల్ని ప్రధాని ఖండించాలి’

‘ఇందిరా గాంధీలా ధైర్యం ఉంటే..ట్రంప్ మాటల్ని ప్రధాని ఖండించాలి’

Rahul Gandhi dares PM Narendra Modi during Operation Sindoor debate | దివంగత ప్రధాని ఇందిరా గాంధీలో ఉండే ధైర్యంలో సగమైనా ఉంటే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించాలని డిమాండ్ చేశారు లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

ఆపరేషన్ సింధూర్ పై లోకసభలో మంగళవారం వాడివేడిగా చర్చ జరిగింది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనికుల చేతులు కట్టేశారని ఆరోపించారు. సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని, కానీ ఈ విషయంలో ప్రభుత్వంలో ఉన్న నేతలకు సంకల్పం కొరవడిందని అన్నారు.

పాకిస్థాన్ కాళ్ళ బేరానికి వస్తేనే యుద్ధం ఆపేశామని ప్రభుత్వం చెబుతోందని కానీ యుద్ధాన్ని తానే ఆపేసినట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ ఇప్పటికే 29 సార్లు చాటింపు వేసుకున్నారని పేర్కొన్నారు.

ఇందిరా గాంధీలో ఉండే ధైర్యం ప్రధాని మోదీలో ఉంటే ట్రంప్ అబద్ధాల కోరు అని, భారత యుద్ధ విమానాలకు నష్టం వాటిళ్లలేదని సభలో ప్రధాని ప్రకటించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions