Tiger In Farm | పొద్దున్నే పొలం పనికి వెళుతుండగా మార్గ మధ్యలో అకస్మాత్తుగా ఓ పెద్ద ఫులి (Tiger) ఎదురైతే ఎలా ఉంటుంది.. ఊహించడానికే చాలా భయంగా ఉంది కదా. అయితే ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పిలిభిత్‌లో ఉన్న టైగర్ రిజర్వ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ టైగర్ రిజర్వ్ పిలిభిత్ నుండి షాజహాన్పూర్ వరకు విస్తరించి ఉంది. పిలిభిత్ నివాస ప్రాంతాలలో అడవి జంతువులు సంచరించే వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు రైతులు బైకు మీద చెరకు తోటకు వెళుతుండగా సడెన్ గా ఓ పెద్దపులి ఎదురైంది. పులి తోట నుంచి బయటకు వచ్చి వారిని చూసిన తర్వాత ఆగిపోయింది. వారిని ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేయగా అది వైరల్ అవుతోంది.