Pensions Distribution In AP | ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పెన్షన్ల (Pensions) పంపిణీ సాగుతోంది. ఉదయం నుండే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది.
భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో పంపిణీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ లో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు.
భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని సీఎం చెప్పారు.
పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.