Director Krish About Harihara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ జులై 24న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాను తొలుత క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత జ్యోతిక్రిష్ణ దర్శక బాధ్యతలు తీసుకున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో క్రిష్ జాగర్లమూడి స్పందించారు. ఇద్దరు లెజెండ్స్ మూలంగానే ఈ మూవీ సాధ్యం అయ్యిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
‘ఇప్పుడు హరి హర వీర మల్లు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల వల్ల సాధ్యమైంది. వారు సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా ఎందరికో స్ఫూర్తి’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఆ ఇద్దరు లెజెండ్స్ లో ఒకరు పవన్ కళ్యాణ్ అని చెప్పారు.
‘పవన్ ఓ అసాధారణ శక్తి, ఆయన నిత్యం రగిలే ఓ అగ్నికణం. దాన్ని ఏ కెమెరా పూర్తిగా బంధించలేదు. హరిహరవీరమల్లు కు జీవం పోసిందే పవన్. ఆయన ఈ చిత్రానికి వెన్నెముక’ అని క్రిష్ తెలిపారు. మరొక లెజెండ్ నిర్మాత ఎ.ఎం. రత్నం అని తెలియజేశారు.
‘భారతీయ సినిమాలోని గొప్ప అనుభవాల వాస్తుశిల్పి. పెద్దగా ఆలోచించే, గందరగోళాన్ని నియంత్రించే, విశ్వాసంతో నిర్మించే ఆయన సామర్థ్యం అరుదు. హరిహర వీరమల్లు ఆయన అచంచలమైన బలం వల్ల నిజం అయ్యింది.’ అని క్రిష్ అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు మరియు నిర్మాత రత్నంకు ధన్యవాదాలు తెలియజేశారు.










