Kannappa screened at Rashtrapati Bhavan | మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘కన్నప్ప’. ఇందులో అగ్ర కథానాయకులు మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటివారు అతిథి పాత్రలో నటించి అభిమానుల్ని అలరించారు.
తాజగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. శివ భక్తుడు కన్నప్ప జీవితాధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు కన్నప్ప మూవీ అద్భుతంగా ఉందని కొనియాడారని మూవీ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అలాగే మంచు విష్ణు నటనను వారు ప్రశంసించారని తెలిపింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు స్పందిస్తూ..భక్తి కథ, సాంస్కృతిక నేపథ్యానికి దక్కిన ఈ గుర్తింపు గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.










