Kalvakuntla Kavitha News | భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్ నాయకులు ఇప్పటివరకు స్పందించలేదని కవిత విమర్శించారు.
అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. ఈ నేపథ్యంలో జాగృతి నాయకులు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు.
అయితే ఈ పరిణామాలపై బీఆరెస్ మౌనం వహించింది. బీఆరెస్ నాయకులు పెద్దగా ఈ అంశంపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అలాగే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ సరైందేనని కితాబిచ్చారు.
దీనిని గులాబీ నేతలు వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. తాను న్యాయ నిపుణులతో చర్చించే ఆర్డినెన్సుకు మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీఆరెస్ నేతలు తన దారికి రావాల్సిందేనని స్పష్టం చేశారు.










