BJP accepts Raja Singh’s resignation | గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. శుక్రవారం ఆయన రాజీనామాను బీజేపీ ఆమోదించింది.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ స్పష్టం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు, రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో రాజాసింగ్ తదుపరి అడుగుపై ఆసక్తి నెలకొంది. కాగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
తనను అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వెయ్యకుండా అడ్డుకున్నారని, తనకు మద్దతు ప్రకటించిన వారిని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజీనామా చేస్తూ లేఖను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు.










