Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది!

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది!

harihara veera mallu

Harihara Veeramallau Release Date | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu) టీం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. హరిహర వీరమల్లు పార్ట్ 1 జూలై 24న విడుదల చేయనున్నట్ల సినిమా యూనిట్ శనివారం ఉదయం ప్రకటించింది.

ఈ సినిమా వాస్తవానికి జూన్ 12నే విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా పలుమార్లు వాయిదా వేశారు. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో పవన్ కళ్యాణ్  చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొదట క్రిష్ ఈ చిత్రంలోని కొంత భాగం తెరకెక్కించారు.

అనంతరం చిత్ర నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రానున్న ఈ సినిమాపై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.

You may also like
pawan kalyan
కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
pawan kalyan and ntr
ఢిల్లీ హైకోర్టుకు పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్.. కారణం ఏంటంటే!
mega family watches og
ఓజీ సినిమాపై మెగాస్టార్ రివ్యూ.. చిరంజీవి ఏమన్నారంటే!
telangana high court
ఓజీ సినిమాకు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions