Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > ప్రభాస్ మూవీ.. గోడ దూకి షూటింగ్ కు వెళ్లిన సీనియర్ నటుడు!

ప్రభాస్ మూవీ.. గోడ దూకి షూటింగ్ కు వెళ్లిన సీనియర్ నటుడు!

anupam kher

Anupam Kher | రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో పీరియాడిక్ యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు Fauji అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నారు. అయితే షూటింగ్ లో పాల్గొనేందుకు అనుపమ్ ఖేర్ చేసిన సాహసం వైరల్ గా మారింది.

షూటింగ్ లొకేషన్ కు వెళ్లేందుకు ఆయన కారులో బయలుదేరారు. అయితే షూటింగ్ లోకేషన్ కు సమీపంలోకి చేరగానే ముందుకు వెళ్లేందుకు దారి లేదు. అది డెడ్ ఎండ్ అని తెలిసింది. కారును రివర్స్ చేయడానికి కూడా వీల్లేకుండా ఆ దారి ఉంది.

అయితే షూటింగ్ స్పాట్ పక్కనే ఉండడంతో నటుడు అనుపమ్ ఖేర్ చేసేదేమీ లేక నిచ్చెన సహాయంతో గోడ దూకి షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. తన 40 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో విధాలుగా షూటింగ్ కు వెళ్లినట్లు, కానీ ఇలా గోడ దూకి వెళ్లడం చాలా ప్రత్యేకంగా మరియు కామెడీగా ఉందని నటుడు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

You may also like
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి
vijay and rashmika in vd14
విజయ్ రష్మిక పెళ్లి డేట్ ఇదే.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
chiranjeevi
పద్మ అవార్డు గ్రహీతలకు ‘చిరు’ సన్మానం..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions