Sunday 6th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఆపరేషన్ సింధూర్..ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్’

‘ఆపరేషన్ సింధూర్..ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్’

PM Modi Hails Operation Sindoor | పాకిస్థాన్ భూభాగంలో మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత భద్రతా బలగాలు దాడులు జరిపిన విషయం తెల్సిందే.

భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ తో సుమారు 70కిపైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్ పై తొలిసారిగా స్పందించారు. ఇది భారత్ కు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రధాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి సభ్యులకు వివరించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఐదు, పాకిస్థాన్ లో నాలుగు ఉగ్రవాద శిబిరాలను సైన్యం ఎలా ధ్వంసం చేసిందో చెప్పారు. క్యాబినెట్ భేటీ అనంతరం ప్రధాని రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని, రాష్ట్రపతి భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది.

ఇకపోతే పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల జరిపిన మారణఖండకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. ఇందులో కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో 10 మంది వరకు చనిపోయినట్లు కథనాలు వస్తున్నాయి. కాగా పాక్ పౌరులు, ఆర్ధిక, సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు, హాని చేయలేదని భారత భద్రతా దళాలు స్పష్టం చేశాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions