Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘స్కూటీ దొంగిలించిన ఎద్దు’

‘స్కూటీ దొంగిలించిన ఎద్దు’

Bull Takes A Scooter Ride In Rishikesh | ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్ లో వింత సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ ఎద్దు పక్కనే పార్క్ చేసిన స్కూటీని చూసి ఆగింది. అంతటితో ఆగకుండా స్కూటీని కాసేపు నడిపింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎద్దు రోడ్డు పక్కన నిలిపిన స్కూటీపై ఎక్కి, దాన్ని కొన్ని అడుగులు ముందుకు నడిపింది. ఈ ఘటన శుక్రవారం గుమానీవాలా ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

స్కూటీపైకి ఎక్కిన ఎద్దు ముందు కాళ్లతో సీటును, వెనుక కాళ్లతో నేలను ఉపయోగించి స్కూటీని ముందుకు తోసింది. కొద్ధి దూరం స్కూటీని డ్రైవ్ చేసిన తర్వాత ఎద్దు ఆసక్తి కోల్పోయి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

“స్కూటీ దొంగతనం చేసే మనుషుల్ని చూశాం, కానీ ఋషికేశ్‌లో ఎద్దు స్కూటీని దొంగిలించడం వేరే లెవెల్!” అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు, “ఇన్సూరెన్స్ వాళ్లతో ఎలా చెప్పాలి, ఎద్దు నా స్కూటీ తీసుకెళ్లి క్రాష్ చేసిందని?” అని జోక్ చేశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions