Tuesday 15th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘ముంబై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఆర్సీబీ మ్యాచ్ కు బుమ్రా’

‘ముంబై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఆర్సీబీ మ్యాచ్ కు బుమ్రా’

Jasprit Bumrah available to play against RCB | ఐపీఎల్-2025 లో ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు ఓడి కష్టాల్లో పడింది. ప్లేఆప్స్ కు చేరాలంటే తర్వాత అడబోయే మ్యాచులు కీలకంగా మారనున్నాయి.

ఈ నేపథ్యంలో ముంబై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ లభించింది. ఆ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమయ్యారు. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరగబోయే మ్యాచ్ కు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు.

ఈ విషయాన్ని టీం హెడ్ కోచ్ జయవర్ధనే ప్రకటించారు. ఆర్సీబీ మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉంటాడని చెప్పారు. ఇప్పటికే బుమ్రా టీంతో కలిశాడు. ప్రాక్టీస్ కూడా చేయడం మొదలుపెట్టాడు.

ముంబై తర్వాత జరగబోయే 10 మ్యాచుల్లో కనీసం 8 గెలిస్తే ప్లేఆప్స్ కు చేరే అవకాశం ఉంటుంది. బుమ్రా రాకతో ముంబై బౌలింగ్ మరింత బలంగా మారనుంది. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్య, బోల్ట్, చహార్ లతో కూడిన ముంబయి బౌలింగ్ విభాగం బలంగానే ఉంది.

ఒకవేళ బుమ్రా వీరికి తోడైతే ప్రత్యర్ధులకు పెను సవాలుగా మారనుంది. అయితే గాయం నుండి ఇప్పుడే కోలుకున్న బుమ్రా ఆర్సీబీ తో జరగబోయే మ్యాచ్ లో ఆడుతారో లేదో అనేది మాత్రం ఆసక్తిగా మారింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions