Sunday 2nd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కేజీ చికెన్ పై రూ.10 మాముళ్లు..టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ సంచలనం

కేజీ చికెన్ పై రూ.10 మాముళ్లు..టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ సంచలనం

YCP Allegations On Bhuma Akhila Priya | ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియపై సంచలన ఆరోపణలు చేసింది వైసీపీ. నియోజకవర్గంలోని చికెన్ షాపులను వదలడం లేదని, ప్రతీ కిలో చికెన్ కు రూ.10 మామూళ్లు వసూలు చేస్తున్నారని జగన్ పార్టీ ఆరోపించింది.

కిలో చికెన్ కు రూ.10 రౌడీ మామూళ్లు ఇవ్వాల్సిందే, తాము చెప్పిన ఫారం నుండే కోళ్లు కొనాలని లేదంటే అధికారుల నోటీసులతో దాడులు చేస్తామని భూమా అఖిలప్రియ భర్త దౌర్జన్యం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఆరోపించింది.

అంతేకాకుండా రూ.కోటి ఇవ్వాలని హోల్ సేల్ వ్యాపారిని బెదిరించారని పేర్కొంది.తెలుగుదేశం నాయకుల కక్కుర్తి పరాకాష్టకు చేరింది. కూటమి ఎమ్మెల్యేలు పనులు, కాంట్రాక్టులు మాత్రమే కాకుండా వీధి వ్యాపారులు, చికెన్ కొట్లను సైతం వదలడం లేదని జగన్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions