Prize Money For Team India | భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సమరంలో భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొంది ట్రోఫీని సొంతం చేసుకుంది.
రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, స్పిన్నర్లు అత్యద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్రలు పోషించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే భారత్ 2024లో టీ20 వరల్డ్ కప్, తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. గతంలో 2002, 2013 తర్వాత 2025లో మూడోసారి టైటిల్ నెగ్గింది.
ఈ ఐసీసీ ట్రోఫీ విజేతగా భారత జట్టు 2.4 మిలియన్ డాలర్లు అనగా భారత కరెన్సీలో 19.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుంది. రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.9.72 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. సెమీఫైనల్లో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు రూ.4.86 కోట్లు లభించాయి.
గ్రూప్ దశలో గెలిచిన జట్లకు రూ.30 లక్షల ప్రైజ్ మనీ లభించనుంది. ఐదు, ఆరోస్థానంలో నిలిచిన జట్లకు సుమారుగా రూ.3కోట్లు.. ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1.2కోట్ల లభించాయి. అంతేకాకుండా ఐసీసీ టోర్నీలో పాల్గొన్నందుకు ఎనిమిది జట్లకు రూ.1.08కోట్లు దక్కాయి.







