Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > ‘మోదీ, అమిత్ షా భద్రాచలం ఎందుకు రాలేదు’

‘మోదీ, అమిత్ షా భద్రాచలం ఎందుకు రాలేదు’

Cm Revanth Reddy About Badrachalam | భ‌ద్రాచ‌లం రావాల‌ని ప్రధాని మోదీ ( Pm Modi ), హోంమంత్రి అమిత్ షా ( Amit Shah )ను ఆహ్వానించినా రాలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఇండియా టుడే కాన్ క్లేవ్ ( India Today Conclave ) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించగా తన కుటుంబం వెళ్లినట్లు చెప్పారు. ‘మా గ్రామంలోనూ రామ మందిరం ఉంది.. భ‌ద్రాచ‌లం ప‌ర‌మ ప‌విత్ర క్షేత్రమ‌ని నేను న‌మ్ముతా.. అయినా మోదీ, అమిత్ రావ‌డం లేదు.’ అంటూ సీఎం విమర్శలు గుప్పించారు.

అలాగే గుజరాత్ రాష్ట్రానిది టెస్ట్ మ్యాచ్ మాడల్ ( Test Match Model ) అయితే, తెలంగాణది ట్వంటీ ట్వంటీ ( 20-20 ) మోడల్ అని అభివర్ణించారు.హైదరాబాద్ నగరాన్ని ముంబై, బెంగుళూరు, ఢిల్లీతో పోల్చుకోవడం లేదని న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్నామన్నారు. తెలంగాణ మాడల్‌తో ఎవరూ పోటీ పడలేరని పేర్కొన్నారు.

హిందీ నేర్చుకోవడమన్నది ఒక ఐచ్చికంగా మాత్రమే ఉండాలని, బలవంతంగా రుద్దకూడదని స్పష్టం చేశారు. కాలేజీల్లో ఫ్రెంచ్, జర్మనీ వంటి ఎన్నో భాషలు ఉన్నాయి, ఎవరికి ఏదిష్టముంటే దాన్ని నేర్చుకుంటారని తెలిపారు. హైదరాబాద్ వేదికగా ఒలంపిక్ క్రీడలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions