Saturday 21st March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్

Nagababu Files Nomination for MLA Quota MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయి అభ్యర్థుల ఎంపిక పై చర్చించారు. జనసేన తరఫున నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

ఈ నేపథ్యంలో నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు బలపరిచారు.

రిటర్నింగ్ అధికారిణి వనితారాణికి నాగబాబు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions