Sunday 2nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తల్లిదండ్రులపై నీచమైన వ్యాఖ్యలు..యూట్యూబర్ పై సుప్రీం ఆగ్రహం

తల్లిదండ్రులపై నీచమైన వ్యాఖ్యలు..యూట్యూబర్ పై సుప్రీం ఆగ్రహం

Supreme Court Serious On Ranveer Allahbadia | ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ ( Indias Got Latent ) షోలో యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా ( Ranveer Allahbadia ) తల్లిదండ్రులు, శృంగారం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమైన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో రణవీర్ పై పలు స్టేషన్లలో ఎఫ్ఐఆర్ ( FIR ) నమోదైంది. ఈ నేపథ్యంలో సదరు యూట్యూబర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం రణవీర్ పై అసహనం వ్యక్తం చేసింది.

ఎవరైనా ఆ వ్యాఖ్యల్ని వినడానికి ఇష్టపడుతాడా, ఇవి తీవ్రంగా ఖండించాల్సిన వ్యాఖ్యలని సుప్రీం పేర్కొంది. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా అంటూ సుప్రీం ప్రశ్నించింది.

ఆ వ్యాఖ్యలు రణవీర్ నీచమైన బుద్దిని తెలియజేస్తుందని, ఇంతకంటే నీచమైన మనస్సు ఎవరికీ ఉండదని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రాణహాని, బెదిరింపులు వస్తున్నట్లు చెబుతున్నావ్ ఇవి కూడా కేవలం ప్రచార కోణంలోనే కనిపిస్తున్నాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే యూట్యూబర్ ( Youtuber ) ను అరెస్ట్ చేయకుండా తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది కోర్టు. పోలీసుల నుండి రక్షణ పొందేందుకు అనుమతినిచ్చింది.

అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్ళొద్దన్ని, పాస్పోర్ట్ ( Passport ) ను మహారాష్ట్ర లోని ఠానే పోలీసులకు అప్పగించాలని స్పష్టం చేసింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions