Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీలో భూకంపం.. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్!

ఢిల్లీలో భూకంపం.. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్!

delhi earthquake

Delhi Earthquake | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi), పరిసర ప్రాంతాలలో సోమవారం ఉద‌యం భూకంపం సంభవించింది. రిక్ట‌ర్ స్కేల్ పై 4.0 తీవ్రత‌తో భూ ప్రకంపనలు సంభవించాయి.

దాదాపు కొన్ని సెక‌న్ల పాటు భూమి కంపించ‌డంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.  బలమైన ప్రకంపనల తో ఢిల్లీ, నోయిడా(Noida), గ్రేటర్ నోయిడా (Greater Noida), ఘజియాబాద్ (Ghajiabad)లలో అనేక ఎత్తైన భవనాల నివాసితులు బయటకు పరుగులు తీశారు.

భూకంపం వచ్చినప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని అధికారి ఒక‌రు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల  ఆస్తి, ప్రాణ‌న‌ష్ట‌ సంభ‌వించ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ఢిల్లీ భూకంపంపై తాజాగా ప్ర‌ ధాని న‌రేంద్ర మోదీ ‘ఎక్స్’  వేదిక‌గా స్పందించారు.

భ‌యాందోళ‌న‌లకు గురికాకుండా ప్ర‌ తి ఒక్క‌రూ ప్ర‌ శాంతంగా ఉండాల‌ని సూచించారు. ముంద‌స్తు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని తెలిపారు. మ‌రోసారి భూప్ర‌ కంప‌న‌లు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో అప్ర‌ మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితిని అధికారులు ప‌రిశీలిస్తున్నార‌ని మోదీ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశీ కూడా ఈ భూకంపంపై స్పందించారు. “ఢిల్లీలో బలమైన భూకంపం సంభవించింది. అందరూ సురక్షితంగా ఉండాలి” అని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

You may also like
దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions