Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > మనువడికి కేసీఆర్ పేరు..అభిమానాన్ని చాటుకున్న బీఆరెస్ నేత

మనువడికి కేసీఆర్ పేరు..అభిమానాన్ని చాటుకున్న బీఆరెస్ నేత

Sarpanch names grandson K Chandrashekhar Rao | ఓ బీఆరెస్ ( BRS ) నేత కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కె ( Mukhra-K ) గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్ బీఆరెస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తన మనువడికి కేసీఆర్ గా నామకరణం చేశారు.

ముఖ్రా కె గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ గ్రామంగా కేసీఆర్ తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కేసీఆర్‌తోనే తమ గ్రామం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితోనే తమ గ్రామానికి జాతీయ స్థాయిలో 5 అవార్డులు వచ్చాయని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. అందుకే తన పిల్లలు గాడ్గే వైష్ణవి-ధీరజ్‌కి జన్మించిన కొడుకుకు కేసీఆర్‌గా నామకరణం చేశామన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions