Sunday 16th August 2026
12:07:03 PM
Home > Uncategorized > ‘తొక్కిసలాట ఘటన మినహా..మిగిలిన ఏర్పాట్లు బ్రహ్మాండం’

‘తొక్కిసలాట ఘటన మినహా..మిగిలిన ఏర్పాట్లు బ్రహ్మాండం’

TTD Chairman BR Naidu News | జనవరి 8వ తారీఖున అత్యంత దురదృష్టవంతమైన సంఘటన జరిగిందన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.

ఈ మేరకు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. తొక్కిసలాత ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం అదేశాల ప్రకారం పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో టీటీడీ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, తిరుమల అనేది కోట్లాది మంది హిందువులు మనోభావాలకు సంభందించిన విషయమని తెలిపారు.

వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటిరెండు సార్లు పరిశీలించాలని కోరారు. మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారం అసత్య వార్తలు , ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు.

పాలకమండలి కి…అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా ఖండించారు. తొక్కిసలాట సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని వెల్లడించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions