Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ వ్యాఖ్యలు..స్పందించిన ‘మా’

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ వ్యాఖ్యలు..స్పందించిన ‘మా’

MAA Response To Poonam Kaur Post | దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) పై సంచలన ఆరోపణలు చేశారు నటి పూనమ్ కౌర్. తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని త్రివిక్రమ్ దెబ్బతీశాడని ఆరోపించారు.

అలాగే తన జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( MAA ) కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో మా అసోసియేషన్ స్పందించింది. పూనమ్ కౌర్ ట్వీట్ పై మా కోశాధికారి శివబాలాజీ స్పందించారు.

పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. తమ టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులలో లేదని పేర్కొన్నారు.

పూనమ్ కౌర్ ట్విట్టర్ లో పెట్టడం వల్ల ఉపయోగం లేదని మా అసోసియేషన్ ను కానీ, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions