Friday 31st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రయాగ్రాజ్ కుంభమేళాకు సర్వం సిద్ధం..2 వేల డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం

ప్రయాగ్రాజ్ కుంభమేళాకు సర్వం సిద్ధం..2 వేల డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం

Kumbh Mela 2025 News | ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ ( Prayagraj ) కుంభమేళాకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు.

12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను ప్రపంచస్థాయి ఉత్సవంలా నిర్వహించాలని యోగి సర్కార్ భావిస్తుంది. ఈ క్రమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే కుంభమేళా ఆరంభ, ముగింపు దినాల్లో డ్రోన్ల ( Drones ) ద్వారా ప్రదర్శన ఉండనుంది.

ఆకాశంలో ఎగిరే డ్రోన్లు మహా కుంభ్, ప్రయాగ మహత్యం కథలతో భక్తులను కనువిందు చేయనున్నాయి. సాగర మథనం, అమృత కలశ అవిర్భావాలను కళ్ళకు కడతాయని అధికారులు పేర్కొన్నారు. మహా కుంభమేళాను ఐక్యతా మేళాగా ప్రధాని మోదీ ( Pm Modi ) అభివర్ణించారు.

భక్తుల భద్రత కోసం 50 వేల మంది సిబ్బంది, 2700 ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే తొలిసారి అండర్ వాటర్ ( Under Water ) డ్రోన్లను వినియోగించనున్నారు. అంతేకాకుండా కుంభమేళా సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్ బాట్ ను అందుబాటులోకి అధికారులు తీసుకురానున్నారు.

ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్లమంది హాజరువుతారని అంచనా ఉంది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions