Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > గుడ్ న్యూస్.. రూ.5,260 కోట్ల పెట్టుబడులు 12,490 మందికి ఉద్యోగాలు

గుడ్ న్యూస్.. రూ.5,260 కోట్ల పెట్టుబడులు 12,490 మందికి ఉద్యోగాలు

Major Pharma Firms To Set Up New Units In Telangana | కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.

తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సచివాలయంలో వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సంప్రదింపులు అనంతరం ఎంవోయూలపై సంతకాలు చేశారు.

ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీలతో ఎంవోయూలు జరిగాయి. ఈ ఆరు కంపెనీలు దాదాపు రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఈ కంపెనీల విస్తరణ కార్యకలాపాల వల్ల ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇప్పటికే గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించనుంది.

మరో నాలుగు నెలల్లో ఈ ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించటంతో పాటు, ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions