Friday 14th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

Poachers Kill And Eat Leopard Meat In Odisha | ఒడిశా రాష్ట్రంలో ఘోరం జరిగింది. వలలో చిక్కిన చిరుత పులిని వండుకుని తినేశారు కొందరు వేటగాళ్లు.

వివరాల్లోకి వెళ్తే, ఒడిశా నౌపడా ( Nuapada ) జిల్లా దియోధర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వేతగాళ్ళు అడవి పందుల కోసం వలను ఏర్పాటు చేశారు. అయితే అందులో చిరుత పులి చిక్కింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి, చిరుతను వండుకుని వారు తినేశారు.

ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. అక్కడ చిరుత తోలు, మిగిలిన మాంసం, తల లభించింది. అనంతరం ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

మరోవైపు ఈ ఘటన పట్ల పీసీసీఎఫ్ ( PCCF ) అధికారి సుశాంత నంద, సమాజంలో ఇటువంటి వారికి చోటులేదన్నారు. తన కెరీర్ లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions