Pawan Kalyan Sweet Warning To Home Minister Anitha | డిప్యూటీ సీఎం ( Deputy Cm ) పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హోం మినిస్టర్ ( Home Minister ) బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పారు.
సోమవారం పిఠాపురం ( Pitapuram ) నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అత్యాచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
క్రిమినల్స్ ( Criminals ) కు కులం, మతం ఉండదని పోలీసులకు ఎన్ని సార్లు చెప్పాలి యాక్షన్ తీసుకోండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. హోంమంత్రి అనిత కూడా జరుగుతున్న ఘటన పట్ల బాధ్యత వహించాలని కుండబద్దలు కొట్టారు.
నేతలు ఇలానే నిశ్చలంగా ఉంటే హోంశాఖ బాధ్యతలు కూడా తానే తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బయటకు వెళ్తే ప్రజలు తమని తిడుతున్నారని పేర్కొన్నారు. నేను హోంశాఖ అడగలేక కాదు..క్రిమినల్స్ కు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆధిత్యనాథ్ ( Yogi Adityanath ) చేసినట్లు చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు.










