Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ సౌత్ ఇండియా పట్ల మోదీ వివక్ష ‘

Cm Revanth Reddy News Latest | ప్రధాని నరేంద్రమోదీ ( Pm Modi ), కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తుందని రేవంత్ మండిపడ్డారు.

రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోగా ఓట్లు అడుగుతున్నారని బీజేపీ ( BJP )ని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల ( Northern States )తో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా తిరిగి వచ్చేది మాత్రం అంతతమాత్రమే అని నిలదీశారు.

తెలంగాణ నుండి కేంద్రానికి ఒక రూపాయి వెళ్తే, తిరిగి వచ్చేది మాత్రం కేవలం నలభై పైసలే అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఆహ్వానిస్తున్నా, పన్నుల విషయంలో మాత్రం వివక్ష జరుగుతుందన్నారు.

మూడవసారి ప్రధాని అయిన మోదీ దేశం కోసం ఎం సేవలు చేశారని ప్రశ్నించారు. పార్టీలను, ప్రభుత్వాలను విడదీశారు తప్ప ప్రజలు ఏమి చేయలేదన్నారు. ఎమోషనల్ పాలిటిక్స్, దేశంలో ఉత్తర, దక్షిణ భారత దేశం అని విభజన తేవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని హాట్ కామెంట్స్ ( Hot Comments )చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions