Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > కొండ సురేఖ పై పరువునష్టం కేసు..నాంపల్లి కోర్టుకు నాగార్జున

కొండ సురేఖ పై పరువునష్టం కేసు..నాంపల్లి కోర్టుకు నాగార్జున

Nagarjuna to Appear in Nampally Court | మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) ను విమర్శించే క్రమంలో ప్రముఖ నటుడు నాగార్జున ( Akkineni Nagarjuna ), నటి సమంతా ( Samantha ) పై మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ పై నాగార్జున రూ.100 కోట్ల క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్ ( Petition ) కు సంబందించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

అక్కినేని కుటుంబం గౌరవం, ప్రతిష్ట దెబ్బతీసేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని నాగార్జున పేర్కొన్నారు. సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని పేర్కొంది.

ఈ క్రమంలో నేడు నాంపల్లి కోర్టు ( Nampally Court )కు నాగార్జున వెళ్లనున్నారు. మధ్యాహ్నం తరువాత నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. నాగార్జున తో పాటు మిగతా సాక్ష్యుల స్టేట్మెంట్ ( Statement ) ను కూడా కోర్టు రికార్డ్ చేయనుంది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions