Saturday 19th September 2026
12:07:03 PM
Home > తాజా > ఆస్తి కోసం బిడ్డల గొడవ..రెండ్రోజులుగా ఇంట్లోనే అమ్మ శవం!

ఆస్తి కోసం బిడ్డల గొడవ..రెండ్రోజులుగా ఇంట్లోనే అమ్మ శవం!

suryapet

Suryapet | ఆస్తి పంపకాలు తేలకపోవడంతో కన్న తల్లి అంత్యక్రియలకు సొంత బిడ్డలే అడ్డుపడ్డారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలోని కందులవారి గూడెంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, గ్రామానికి చెందిన వేము లక్ష్మమ్మ అనారోగ్యంతో బుధవారం రాత్రి మరణించారు. ఆమె ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఇదివరకే ఒక కుమారుడు మృతి చెందాడు.

లక్ష్మమ్మ మరణవార్త తెలుసుకున్న కుమారుడు, ముగ్గురు కుమార్తెలు, కోడలు గ్రామానికి చేరుకున్నారు. అయితే మృతిచెందిన లక్ష్మమ్మ వద్ద రూ.21 లక్షల ఆస్తి, 20 తులాల బంగారం ఉంది.

తల్లి అంత్యక్రియల గురుంచి ఏ మాత్రం ఆలోచించకుండా,ఆస్తి పంపకాల కోసం గొడవపడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు.

గొడవ పరిష్కారం కాకవపోడంతో అంత్యక్రియలు జరగలేదు. రెండ్రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచారు. దింతో అంత్యక్రియలు చేయకుండా, ఆస్తుల కోసం గోడవపడుతున్న కన్నబిడ్డల పై గ్రామస్తుల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

You may also like
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions