Andhra Premier League | ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (APA) ఆధ్వర్యంలో ఏటా టి20 (T20) ఫార్మాట్ లో ‘ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ‘ (Andhra Premier League) జరుగుతున్న విషయం తెల్సిందే. రెండేళ్ల కిందట ఇది (APL) ప్రారంభం అయ్యింది. ఈ టోర్నీలో మొత్తం ఆరు టీంలు పోటీ పడతాయి.
తాజాగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో రికార్డు సృష్టించారు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy).
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టోర్నీ కోసం గురువారం బిడ్డింగ్ ను నిర్వహించారు. ఇందులో నితీష్ కుమార్ రెడ్డి ఏకంగా రూ.15 లక్షల 60 వేల ధరకు అమ్ముడుపోయారు. ఈ స్టార్ ప్లేయర్ ను గోదావరి టైటాన్స్ (Godavari Titans) కొనుగోలు చేసింది.
ఆంధ్రా లీగ్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నితీష్ చరిత్ర సృష్టించారు. గతంలో హనుమ విహారి అత్యధికంగా రూ.6.60 వేల కు సోల్డ్ అయ్యారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL-2024)లో భాగంగా హైదరాబాద్ తరఫున ఆడుతున్న నితీష్, అల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.