Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > ఆ వార్తలన్నీ అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన స్మితా సబర్వాల్!

ఆ వార్తలన్నీ అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన స్మితా సబర్వాల్!

smitha sabharwal

Smita Sabharwal | సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ (Smita sabharwal) గురువారం నాడు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సారి సచివాలయానికి వచ్చారమే.

కాగా గత బీఆరెస్ ప్రభుత్వంలో సీఎంఓ సెక్రటరీ గా మరియు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె, ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం తో, కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారంటూ ఆమెపై జోరుగా ప్రచారం జరిగింది.

అయితే తాను ఎక్కడికి వెళ్లడం లేదని, తెలంగాణ రాష్ట్రంలోనే బాధ్యతలు నిర్వహిస్తానని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు స్మిత సబర్వాల్. ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పజెప్పినా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క తో స్మిత సబర్వాల్ భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions