Thursday 17th September 2026
12:07:03 PM
Home > తాజా > హామీలకు డబ్బులు ఇటలీ నుండి తెస్తారా లేక..కాంగ్రెస్ పై రాజాసింగ్ సెటైర్లు..!

హామీలకు డబ్బులు ఇటలీ నుండి తెస్తారా లేక..కాంగ్రెస్ పై రాజాసింగ్ సెటైర్లు..!

raja singh

Rajasingh Comments | బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) కాంగ్రెస్ పార్టీ పై సెటైర్లు గుప్పించారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను చూసి ప్రజలు ఆ పార్టీని గెలిపించారని, మరి ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటలీ నుండి డబ్బులు తీసుకువస్తార లేక వాళ్ళ పార్టీ ఆఫీస్ నుండి తీసుకువస్తారా? అంటూ ప్రశ్నించారు రాజాసింగ్.

కేసీఆర్ అప్పులు చేసి వెళ్లిపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీలను ఎలా అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఉంటే తాము ప్రమాణం చేయమన్న మాటపై నిలబడ్డామని తెలిపారు. ఇక నుండి కాంగ్రెస్ పార్టీతో తమకు యుద్ధం మొదలవుతుందని పేర్కొన్నారు రాజాసింగ్.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions