Friday 18th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > బోధన్‌ కమ్మ సంఘ రజితోత్సవవేడుకలను విజయవంతం చేయాలి

బోధన్‌ కమ్మ సంఘ రజితోత్సవవేడుకలను విజయవంతం చేయాలి

Bodhan Kamma Sangha Rajitotsavavedu should be successful

బోధన్‌: బోధన్‌ పట్టణ శివారులోని కమ్మ సంఘ భవనంలో నేడు, రేపు నిర్వహించే కమ్మ సంఘం రజితోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని బోధన్‌ కమ్మ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పళ్లెంపాటి శివన్నారాయణ, దావులూరి హరినాథ్‌ బాబు, కోశా ధికారి శ్రీధర్‌, ప్రోగ్రాం చైర్మన్‌ ఆదినారాయణ, కో చైర్మన్‌ అప్పారావు లు ఒక ప్రకటనలో తెలిపారు. కమ్మ సంఘం స్థాపించి 25ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 9 శనివారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు క్రీడా పోటీలు, మహిళలకు రంగవల్లి పోటీలు నిర్వహించ డం జరుగుతుందన్నారు. 10 ఆదివారం ఉదయం 9నుండి సాయంత్రం వరకు ముఖ్య అతిథుల సందేశాలతో పాటు సమాజసేవ తదితర రంగాలలో ఉన్నత సేవలు అందించిన వారికి సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం, అనంతరం భోజనం కార్యక్రమం ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌ శివప్రసాద్‌ బృందంచే సాంస్కృతిక, సంగీత, నాట్య, మిమిక్రీ తదితర వినోద కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అనంతరం అల్పాహారం, రాత్రి భోజనం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమాలలో కమ్మ సంఘం సోదర సోదరీమణులు వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యులు, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions