Sunday 13th September 2026
12:07:03 PM
Home > Uncategorized > ఏడుపాయల దుర్గామాత

ఏడుపాయల దుర్గామాత

Mother Durga of seven legs

-ఘన స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు..సన్నిధిలో మైనంపల్లి కుటుంబం..

మెదక్‌ఎమ్మెల్యేగా గెలుపొందిన మైనంపల్లి రోహిత్‌ రావు గురువారం సాయంత్రం ఏడుపాయల వన దుర్గ మాతను తల్లిదండ్రులు మైనంపల్లి వాణి హనుమంతరావు,అతని సతీమణి శివానిలతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి.మోహన్‌రెడ్డి వారిని ఆలయమర్యాదల ప్రకా రం పూలమాల, శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు,అర్చకులు ఎమ్మెల్యే రోహిత్‌ కుటుంబానికి పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలి కారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్‌ నాయక్‌,పార్టీ మండల సీనియర్‌ నాయకుడు ప్రశాంత్‌ రెడ్డి, నాయకులు శ్రీకాంతప్ప, నిట్టలాక్షప్ప, సతీష్‌,ఆకుల శ్రీనివాస్‌,రమేష్‌ గౌడ్‌, నరేందర్‌ గౌడ్‌,త్యార్ల రమేష్‌,ముశెట్టి కిష్టయ్య పాల్గొన్నారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions