Tuesday 2nd June 2026
12:07:03 PM
Home > తెలంగాణ > బయట కార్యక్రమాల్లో పాల్గొనని బీఆర్ఎస్ అధినేత

బయట కార్యక్రమాల్లో పాల్గొనని బీఆర్ఎస్ అధినేత

BRS chief who does not participate in outside activities

-ఎన్నికల ఫలితాల తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్
-చింతమడక గ్రామస్తులను ఫామ్ హౌస్ లోకి అనుమతించని పోలీసులు

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు. బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు, ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే, వీరిని పోలీసులు గేట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలకు అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దీంతో, వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions