Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > పార్టీ కండువాతో ఓటు వేసిన మంత్రి.. కేసు నమోదు!

పార్టీ కండువాతో ఓటు వేసిన మంత్రి.. కేసు నమోదు!

Indrakaran reddy

Allola Indrakaran Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే పార్టీ కండువా తో మంత్రి ఓటు వేయడం సంచలనంగా మారింది.

మంత్రి, నిర్మల్ బీఆరెస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఉదయం ఎల్లపెల్లిలో ఓటు వేశారు. కాగా బీఆరెస్ పార్టీ కండువా తో ఆయన ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ కండువా తో ఓటు వేయడం ద్వారా ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఇంద్రకరణ్ రెడ్డి ప్రవర్తన ఉందని ఎన్నికల అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇంద్రకరణ్ రెడ్డి పై కేసు నమోదయింది. మరోవైపు బెల్లంపల్లి బీఆరెస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య కూడా గులాబీ కండువా వేసుకొని ఓటు వేశారు.

పార్టీ కండువా తో పోలింగ్ కేంద్రానికి రావడం, అయిన అధికారులు ఎటువంటి అభ్యంతరం  చెప్పకపోవడం తో భగ్గుమంటున్నాయి ప్రతిపక్షాలు.

You may also like
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
no permission for organizations on my name, says ktr
నా పేరుతో వాటికి అనుమతి లేదు: కేటీఆర్ 
kcr revanth
ఇదేక్కడి జాతిపిత లక్షణం.. కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు!
Election commission
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions