Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ‘ఆ చార్జీలు పూర్తిగా రద్దు చేస్తాం..’ సీఎం కేసీఆర్ తీపి కబురు..!

‘ఆ చార్జీలు పూర్తిగా రద్దు చేస్తాం..’ సీఎం కేసీఆర్ తీపి కబురు..!

kcr news

KCR Speech Today | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) మరో కీలక హామీ ఇచ్చారు.

సోమవారం మానకొండూరు, స్టేషన్ ఘనపూర్, నకిరేకల్, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు గులాబీ బాస్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోమారు బీఆరెస్ (BRS Party) అధికారంలోకి రాగానే ఆటోలకు సంబంధించి ఫిట్నెస్, సెర్టిఫికెట్ చార్జీలను మాఫీ చేస్తామని హామీనిచ్చారు.

KCR Speech Today మోదీ (Modi) అధికారంలోకి వచ్చాక డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడంతో ఆటో నడుపుకునే వారు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు కేసీఆర్.

అలాగే దేశ వ్యాప్తంగా ఆటోలకు టాక్స్ విధిస్తారని, కానీ తాము అధికారంలోకి రాగానే ఆ టాక్స్ (Tax) ను రద్దు చేసినట్లు గుర్తు చేశారు ఆయన.

ఎన్నికలు అయిన మరునాడే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ దాదాపు 90 శాతం అయిపోయిందని, రూ. లక్ష వరకు రుణమాఫీ అయ్యిందని తెలిపారు.

మిగిలిన నాలుగైదు శాతం వారికి కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అస్సలు రుణమాఫీ కాకుండా అడ్డుపడిందే కాంగ్రెస్ (congress) నాయకులని ఆరోపించారు కేసీఆర్.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions