Monday 14th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > కపిల్ దేవ్ ను అవమానించిన బీజేపీ.. సంజయ్ రౌత్ కామెంట్స్

కపిల్ దేవ్ ను అవమానించిన బీజేపీ.. సంజయ్ రౌత్ కామెంట్స్

sanjay raut

Sanjay Raut | శివసేన (Shiv Sena) ఉద్ధవ్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు కపిల్ దేవ్ (Kapil Dev) ను పిలవకుండా అవమానించారని విమర్శించారు సంజయ్ రౌత్.

బీజేపీ ఒత్తిడి కారణంగానే బీసీసీఐ (BCCI) కపిల్ దేవ్ ను ఆహ్వానించలేదని ఎందుకంటే గతంలో బీజేపీ ఎంపీకి వ్యతిరేకంగా ఢిల్లీ లో మహిళా రెజ్లర్లు చేసిన ధర్నాకు కపిల్ దేవ్ మద్దతు తెలిపారన్నారు సంజయ్ రౌత్.

అందుకోసమే ఆయన్ను ఫైనల్ మ్యాచ్ కు పిలవకుండా బీజేపీ, బీసీసీఐ, ఐసీసీ (ICC) కపిల్ దేవ్ ను అవమానించారని ధ్వజమెత్తారు. 

ప్రధాన మోదీ (Narendra Modi) ని డామినేట్ చేస్తారనే కపిల్ దేవ్ ని ఫైనల్ మ్యాచ్ కు పిలవలేదని ఆగ్రహించారు.

అంతేకాకుండా గుజరాత్ బీజేపీ లాబి మూలంగానే వరల్డ కప్ ఫైనల్ మ్యాచ్ ముంబై (Mumbai) నుండి అహ్మదాబాద్ కు తరలిపోయిందని ఆరోపించారు.

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

You may also like
త్రిష పేరుతో వ్యాఖ్య.. ఉదయనిధిపై TVK, BJP తీవ్ర విమర్శలు!
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
raghav chadha
ఆప్‌లో ‘టాక్సిక్’ వాతావరణం.. మౌనం వీడిన రాఘవ్ చద్దా!
bandi sanjay kumar
అభివృద్ధి మా విధానం… హిందుత్వం మా నినాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions